దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి, దివంగత మంత్రి ముత్యం రెడ్డిలకు ఘన నివాళి

నవ తెలంగాణ- రాయపోల్ 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దివంగత మాజీ మంత్రి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డిల వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించడం జరిగిందని దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండల కేంద్రం శివాజీ చౌరస్తాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, చెరుకు ముత్యం రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఆరోగ్యశ్రీ, 108, రైతు రుణమాఫీ, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్ మెన్స్, జలయజ్ఞం, రైతులకు ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ లాంటి ఎన్నో ప్రజా రంజక పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధిలో దిగ్విజయంగా ముందుకు నడిపించారు. దుబ్బాక నియోజకవర్గంలో ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధే నేటికీ కళ్ళ ముందు కనబడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి మహా నాయకులు లేకపోవడం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బండారు లాలు, నాయకులు కర్నాల శ్రీనివాసరావు, దశరథ్ రెడ్డి, నరసింహారెడ్డి, సంపత్ రెడ్డి, మల్లేశం, మల్లారెడ్డి, నందం,  ప్రవీణ్, ఆంజనేయులు గౌడ్, రమేష్, అమరేందర్ రెడ్డి, మహేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.