నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ ’35-చిన్న కథ కాదు’.
సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్, డైరెక్టర్. ఈ సినిమా ఈనెల 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత సజన్ యరబోలు మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ఏదైనా సినిమా చేస్తే జనాలకు గుర్తుండిపోవాలి. క్లాసిక్‌గా నిలిచిపోవాలి. ‘మహానటి, జర్నీ, సీతారామం’ లాంటి కథ కోసం వెతుకుతున్న సమయంలో నాకు వచ్చిన కథ ’35-చిన్న కథ కాదు’.
మదర్ సెంటిమెంట్‌కి మించిన కమర్షియల్ ఎలిమెంట్ ఏది లేదు. ఇందులో అది అద్భుతంగా కుదిరింది. కథ, స్క్రీన్ ప్లే పెర్ఫెక్ట్‌గా వుంటాయి. ఓ పెద్ద హీరో ఈ సినిమా చూసి వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ థియేటర్‌కి పంపించే కథ అని కాంప్లిమెంట్ ఇచ్చారు.
సినిమాని అందరూ ఓన్ చేసుకుంటారు. ఇది థియేటర్ కోసం చేసిన సినిమా.. తిరుపతి, అక్కడ ఓ ఇల్లు, స్కూల్ ఇలా ఓ బ్యూటీఫుల్ వరల్డ్ వుంటుంది. సినిమా చూస్తున్నపుడు ఆడియన్స్‌కి ఆ వరల్డ్‌లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
నివేద, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌తోపాటు పిల్లలు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
కన్నడలో కాంతార, మల యాళంలో మంజుమ్మల్ బార్సు, తమిళలో మహారాజ, తెలుగులో .’35-చిన్న కథ కాదు’. ఇది పదేళ్ళు నిలిచిపోయే సినిమా అవుతుంది. బాపు, విశ్వనాథ్ సినిమాలని గుర్తుచేస్తుంది. ఈ సినిమా నా కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాతో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ‘గతం’కు సీక్వెల్ జరుగుతోంది. ఓ థ్రిల్లర్‌ని చేస్తున్నాం.