ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. వరదల వల్ల ఎంతో మందికి నీడ లేకుండాపోయింది. ఎంతో మందికి ఆహారం అందకుండా పోతోంది. వరద బాధితులకు అండగా నిలిచేందుకు నిర్మాత బన్నీ వాస్ ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వరదల వల్ల నష్టపోయిన వారికి సాయంగా ఆరు టీం నిలిచింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఉండే సామాజిక బాధ్యత నుంచి స్పూర్తి పొంది బన్నీ వాస్ అండ్ టీమ్ వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా సోమవారం నుండి వారాంతానికి వచ్చే ‘ఆరు’ కలెక్షన్లలో నిర్మాత వాటాలో 25% జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు అందజేస్తామని నిర్మాత బన్నీ వాస్, గీతా ఆర్ట్స్ సంస్థ ప్రకటించింది.నార్నే నితిన్ హీరోగా వచ్చిన ‘ఆరు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.