– మన యాత్రి వెల్లడి
హైదరాబాద్ : నగరానికి చెందిన క్యాబ్, ఆటో బుకింగ్ యాప్ ‘మన యాత్రి’కి విశేష ప్రాచుర్యం లభిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. పీపుల్ ఫస్ట్ విధానంతో మన యాత్రి 35,000 ఆటోలు, 25,000 క్యాబ్ సర్వీసులతో సేవలందిస్తున్నట్లు పేర్కొంది. ఆటోలకు సగటున 30 సెకన్లు, క్యాబ్‌లకు 40 సెకన్ల సమయంతో వేగవంతమైన బుకింగ్‌లను అందిస్తున్నట్లు తెలిపింది. ఇది డ్రైవర్లకు కమీషన్ లేకుండా రూ.800 కోట్లు, ప్రయాణికులకు వారి ప్రయాణ ఖర్చులపై దాదాపు రూ .100 కోట్లు ఆదా చేయడానికి సహాయపడుతుందని వెల్లడించింది.