న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ జెఎల్ఆర్ ఇండియాతో దిగ్గజ ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒప్పందం కుదర్చుకుంది. దీంతో జెఎల్ఆర్ ప్రాధాన్య వాహన ఫైనాన్షియర్ కానుందని ఆ బ్యాంక్ పేర్కొంది. రెండు బ్రాండ్ల మిశ్రమ బలాన్ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులకు అంతరాయం లేని ఫైనాన్సింగ్ ఎంపికలు, ఆధునిక లగ్జరీ కార్ల కొనుగోలు అనుభవాన్ని అందించడమే లక్ష్యమని తెలిపింది. ఈ ఒప్పందంలో జెఎల్ఆర్ ఇండియా ఎండి రాజన్ అంబ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిటెయిల్ అసెట్స్ గ్రూప్ హెడ్ అరవింద్ వోహ్రా సంతకాలు చేశారు.