కురుమ పేద విద్యార్థులకు అండగా ఉంటాం..

నవతెలంగాణ-భిక్కనూర్
కురుమ కులానికి చెందిన పేద విద్యార్థులకు అండగా ఉంటామని కురుమ యువ చైతన్య సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంబల్ల సాయి నిఖిల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కురుమ యువ చైతన్య సమితి పట్టణ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కురుమ ఉత్తమ విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కురుమ విద్యార్థులు చదువుతోపాటు ఇతర రంగాలలో ముందుకు వెళ్ళాలని, కష్టపడి చదువుకునే విద్యార్థులకు అండగా నిలుస్తామని తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాలువాలతో సత్కరించి మెమొంటోలు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు అంబల్ల మల్లేశం, కురుమ సంఘం ప్రతినిధులు బీరయ్య, మల్లయ్య, బిక్షపతి, తదితరులు ఉన్నారు.