
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్…
నవతెలంగాణ-భువనగిరి రూరల్
వామపక్షాల పోరాట ఫలితంగానే కలెక్టర్ దిగి వచ్చిందని, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాచౌక్ యధావిధిగా కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ తెలిపారు. సోమవారం వామ పక్షాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ ఎత్తివేతను నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అణచివేస్తుంది అన్నారు. హైదరాబాదులో ఇందిరా పార్క్ ధర్నా చౌక ఎత్తివేయడం పట్ల హైకోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. హరితహారంలో మొక్కలు నాటడం ధర్నా చౌక స్థలం వద్ద మట్టిని పోసి, చదును చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏషాల అశోక్, జిల్లా నాయకులు చెక్క వెంకటేష్, సి పి ఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఈకిర్త్రి సహదేవ్, మహిళా సంఘం నాయకురాలు బండి జంగమ్మ, సీపీఐ రైతు సంఘం నాయకులు యాదిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పండు, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు లు పాల్గొన్నారు.