ప్రతి నిరుపేద కుటుంబాలకు సీఎం నిధి భరోసా

CM fund assurance for every poor familiesనవతెలంగాణ – వీర్నపల్లి
ప్రతి నిరుపేద కుటుంబాలకు సీఎం నిధి భరోసనిస్తుందనీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రం తోపాటు వన్ పల్లి,గర్జనపల్లి గ్రామాల్లో మంగళ వారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలసి లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి, నాయకులు నందగిరి శ్రీనివాస్, ప్రకాష్ నాయక్, బానోతు రాజు నాయక్, నక్క శ్రీనివాస్, భూక్య సంతోష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.