
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ నందు పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హాందన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు , ఏ ఐ సి సి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యొక్క 53వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్,నగేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నఫరత్ చొడో భారత్ జోడో అనే నినాదంతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి భారత దేశ ప్రజలందరూ ఒకటేనని, బడుగు బలహీన వర్గాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే వారికి మనో ధైర్యాన్ని అందించారని ,కాంగ్రెస్ నాయకులు అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చారని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తుంటే రాహుల్ గాంధీ అలుపెరుగని పాదయాత్ర చేసి భారత్ జోడో పేరుతో దేశ ప్రజలందరినీ ఏకతాటి పైకి తీసుకువచ్చారని ఆయన అన్నారు.రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క లక్ష్యమని కావున ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కస్టపడి పని చేయాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముప్పాగంగారెడ్డి, మాజీ బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్ ,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతి రెడ్డి రాజారెడ్డి,కేశ మహేష్,అబుద్ బిన్ హండం,మీసాల సుధాకర్,రామ్ భూపాల్, ఈశ, ప్రితం,చంద్ర కల, ఉష,రేవతి, ఎజాజ,సుభాష్ జాదవ్,స్వామి గౌడ్,పద్మ,మూష్షు పటేల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.