నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ఆద్వర్యంలో స్వామి రామానంద తీర్థ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సంస్థ డైరెక్టర్ పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా “దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన” పథకం ను గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బేసిక్ కంప్యూటర్స్ (డాటా ఎంట్రీ ఆపరేటర్) కోర్సును 3 నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి, భోజనం ఉచితంగా అందించి, శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. ఇంటర్ పాసైన,18-35 సంవత్సరాల లోపు వయస్సు కల్గిన యువతీ యువకులు సెప్టెంబర్ 09-2024 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఎస్సీ/ ఎస్టీ/ మైనారిటీ అభ్యర్థులకు ప్రాదాన్యత ఉంటుందని, పూర్తి వివరాలకు పోన్ నెంబర్ (1) 9133908000, (2) 9133908111, (3) 9133908222 లను సంప్రదించాలని ఆమె కోరారు.