‘ఏరోగ్లైడ్‘ డిజైన్ తో వ్యాపార తరగతి సౌకర్యం అందచేస్తున్న ఎంజి విండ్సర్

నవతెలంగాణ-హైదరాబాద్ : జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఎంతగానో అంచనా వేయబడిన మరియు సరికొత్త ఎంజి విండ్సర్ – భారతదేశపు మొదటి ఇంటిలిజెంట్ క్రాస్ ఓవర్ యుటిలిటి వెహికిల్ [CUV] యొక్క ‘ఏరోగ్లైడ్‘ డిజైన్ ను వీడియో ద్వారా ఈ రోజు విడుదల చేసింది. ఈ అత్యంత ఆధునికమైన డిజైన్ గొప్ప కళాపనితనంతో నిరంతరంగా ఆధునిక ఏరోడైనమిక్స్ తో సమీకృతం చెందుతుంది. డ్రైవింగ్ అనుభవాన్ని సౌకర్యం మరియు ఉత్తమదనం యొక్క మరొక స్థాయికి తీసుకువెళ్తుంది, వ్యాపార తరగతి ప్రయాణానికి చిహ్నంగా నిలుస్తుంది. ద ఏరో గ్లైడ్ డిజైన్ ఏరోడైనమిక్ శ్రేష్టత యొక్క కళకు ప్రతిరూపంగా నిలిచింది, ఎంజి విండ్సర్ లో చేసే ప్రతి ప్రయాణం విలాసవంతంగా ఉన్నంత సాఫీగా ఉండేలా నిర్థారించడానికి ఖచ్చితంగా రూపొందించబడింది. ఇది వ్యాపార తరగతి ప్రయాణం యొక్క నిరంతర సొగసుదనం నుండి ప్రేరణ పొందుతుంది, మరియు డిజైన్ యొక్క ఏరో అంశం వాహనం రద్దీలో కూడా సులభంగా ప్రయాణించడాన్ని నిర్థారిస్తుంది. ఏరోడైనమిక్స్ కు ఇచ్చిన ఈ ప్రాధాన్యత ఇంటిలిజెంట్ CUV యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడటమే కాకుండా ఈ వాహనంలో ప్రయాణించే అందరికీ ఒక ఉత్తమమైన ప్రయాణం కేటాయిస్తుంది. ప్రత్యేకమైన ఈవి ప్లాట్ ఫాంపై రూపొందించబడిన, ఎంజి విండ్సర్ పొడవైన వీల్ బేస్ తో మద్దతునిస్తుంది. ఇది శ్రేణిలో మొదటిసారి ప్రారంభమైంది మరియు శ్రేణి కంటే ఒక స్థాయి ఎక్కువగా ఉన్న వాహనాలతో పోల్చదగినది, విశ్రాంతిదాయకమైన డ్రైవ్ అనుభవం కోసం కావలసినంత కేబిన్ స్థలాన్ని నిర్థారిస్తుంది. సరికొత్త విండ్సర్ నిర్మాణపరమైన కళాఖండంగా మరియు రాచ వంశస్థుల వారసత్వానికి చిహ్నంగా పేరు పొందిన యుకేలోని దిగ్గజ విండ్సర్ కోట నుండి ప్రేరణ పొందింది. ఎంజి విండ్సర్ దిగ్గజపు కోట వలే సూక్ష్మమైన కళాపనితనం మరియు శ్రేష్టతకు నిబద్ధతలను ప్రదర్శిస్తుంది. అభివృద్ధి చెందుతున్న రోడ్ నెట్ వర్క్ మరియు మౌళిక సదుపాయాలతో CUVలు భారతదేశానికి క్రమంగా సంబంధించినవిగా మారాయి. మొదటి ఇంటిలిజెంట్ CUVగా, ఏరోడైనమిక్ డిజైన్ మరియు విశాలమైన ఇంటీరియర్స్ యొక్క పరిపూర్ణమైన మిశ్రమాన్ని అందించడానికి విండ్సర్ వాగ్థానం చేసింది, ప్రతి రోజూ వాడటానికి ఉత్తమమైనదిగా తయారు చేసింది. ఇది విలక్షణమైనది, కుటుంబాలతో కలిసి కావలసినంత సౌకర్యంతో రోజూ ప్రయాణించడానికి లేదా వారాంతంలో విహారాల కోసం ప్రయాణించడాన్ని నిర్థారించింది. వాహనానికి గల అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ గుంతలపై మెరుగ్గా ప్రయాణించడానికి, స్పీడ్ బంప్స్, మరియు సమానంగా లేని ఉపరితలాలు పై ప్రయాణించడానికి అనుకూలం చేసింది. ఇది వాహనంతో సాఫీగా మరియు మరింత సౌకర్యవంతమైన డ్రైవ్ ని అనుభవించవచ్చని తెలియచేస్తోంది.