నవతెలంగాణ – దుబ్బాక రూరల్
పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం పోషణ మాసం అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, గర్భిణులు, బాలింతలకు ఈ కార్యక్రమం పై అవగాహన కలిగి ఉండాలని దుబ్బాక ఐసీడీఎస్ సీడీపీవో ఎల్లయ్య అన్నారు. పోషణ మాసం ప్రోగ్రాం లో భాగంగా బుధవారం దుబ్బాక మండల పరిధిలోని రామక్క పేట గ్రామంలో విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ డే సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించే బాలమృతంలో అనేక పోషకాహార పదార్థాలు ఉన్నాయని, పిల్లల బరువు ఎప్పటికప్పుడు నమోదు తో పాటు టీకాలు వేయించాలని అంగన్వాడి టీచర్ కి, ఏఎన్ఎం లకు సూచించారు. పోషణ మాసం కార్యక్రమాలు సెప్టెంబరు 1 నుంచి 30 వరకు జరగనున్నాయని తెలిపారు. అనంతరం బాలామృతం గుడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ స్వరూప ,బ్లాక్ కో ఆర్డినేటర్ శాంసన్,సెక్రటరీ రమ్య, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు సరస్వతి,రాములమ్మ, బాలామని, ఐకెపి సి ఎ, ఆశాలు, తల్లులు, గర్భవతులు ఉన్నారు.