వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలి 

– రైతులను మోసం చేస్తున్న కెసిఆర్ సర్కార్ 

నవతెలంగాణ – చిన్నకోడూరు
ఎన్నికల సమయంలో రైతులకు కల్లబొల్లి హామీలిచ్చి గద్దెనెక్కాక కెసిఆర్ సర్కార్ రైతులను మోసం చేస్తున్నారని, వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలనీ తెలంగాణ రైతు సంఘము ఆధ్వర్యంలో చిన్నకోడూరు తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులూ మద్దతు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు సంఘము జిల్లా అధ్యక్షులు చల్ల తిరుపతి రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ తో కలిసి మాట్లాడుతూ… ముమ్మాటికీ బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, కెసిఆర్ పాలనలో రైతులు మోసపోయారన్నారు. వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలనీ డిమాండ్ చేసారు. అంతే కాకుండా గత ప్రభుత్వాల మాదిరిగా సబ్సిడీలో పనిముట్లు, విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రంలో రైతు సంఘము మండల అధ్యక్షుడు నాక్కిరెడ్డి బల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసం మహేందర్ , కృష్ణారెడ్డి, బాలయ్య, పర్శరాంలు, జయంత్, ఎల్లయ్య, నర్సయ్య, జగన్, శేషు తదితరులు పాల్గొన్నారు.