నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏవోగా కే. పార్థసారథి బాధ్యతలను స్వీకరించారు. ఉద్యోగ బదిలీలలో భాగంగా ఆయన సూర్యపేట నుండి నల్లగొండకు వచ్చారు. నల్లగొండ జిల్లాకు చెందిన పార్థసారథి గత 2015 నుండి 2021 డిసెంబర్ వరకు గిరిజన సంక్షేమ శాఖ ఎఓ గా బాధ్యతలను నిర్వర్తించారు. బాధ్యతలను స్వీకరించిన పార్థసారధికి పలువురు గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.