బ్లాక్ బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా ‘మత్తువదలారా2’ ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయ్యింది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మీడియతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
‘ఇదొక మంచి థ్రిల్లర్. యాక్టర్స్ ట్రాజెడీ నుంచి కామెడీ జనరేట్ అవుతుంది. ‘మత్తువదలారా’ పార్ట్ 1 బిగ్ హిట్. సెకండ్ ార్ట్, ఫస్ట్ పార్ట్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. శ్రీసింహ, సత్య క్యారెక్టర్స్ డెలివరీ బార్సు నుంచి స్పెషల్ ఏజెంట్స్‌గా కనిపిస్తారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు సన్నిధి. తను కూడా ఒక స్పెషల్ ఏజెంట్. యాక్షన్ కూడా చేశా. మాచో రోల్. అది నాకు చాలా బాగా నచ్చింది. గన్స్‌తో యాక్షన్ ప్లే చేయడాన్ని చాలా ఎంజారు చేశా. ఈ సినిమాలో లిరిక్స్ రాయడంతో పాటు సాంగ్ పాడాను. అలాగే నా టీంతో సాంగ్ కొరియోగ్రఫీ కూడా చేశాను. డైరెక్టర్ రితేష్ రానా చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఇందులో కాలభైరవ మ్యూజిక్ సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. నా సాంగ్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళారు. తిరువీర్‌తో ఓ లవ్ స్టొరీ, అలాగే ఓ తమిళ మూవీ స్టార్ట్ కాబోతోంది’.