వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

– భక్తిశ్రద్ధలతో పండగ జరుపుకోవాలని ప్రజలకు పిలుపు
నవతెలంగాణ-నల్లొండ కలెక్టరేట్ : వినాయక చవితిని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ వినాయకుడి ఆశీస్సులతో  చేసే ప్రతి కార్యం విజయంతం కావాలని ఆకాంక్షించారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలు, రైతులు త్వరగా కోలుకోవాలని ఆ గణనాధున్ని కోరుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.వినాయక చవితి పండుగను ప్రజలంతా తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.