నవతెలంగాణ- రామారెడ్డి : మండల కేంద్రంలో జరిగిన దొంగతనాన్ని సీసీ కెమెరా పట్టించాయి. మండల కేంద్రానికి చెందిన కొట్టే నర్సింలు గత నెల 31వ తేదీ ఇంటికి తాళం వేసి రాజంపేటకు వెళ్ళగా, అదే అదనుగా చూసి ఇంటికి కన్నం వేసి, అలమారి లో గల వెండి, బంగారు నగలను దొంగిలించ గా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతూ, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కన్నాపూర్ తండాకు చెందిన కాట్రోత్ మైపాల్ ను పట్టుకొని విచారించి, దొంగిలించిన వెండి బంగారు నగలను స్వాధీనం చేసుకొని, మహిపాల్ ను కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఎస్సై నరేష్, ఏ ఎస్ ఐ లచ్చిరాం, హెడ్ కానిస్టేబుల్ దేవా గౌడ్, సిబ్బంది సాయిలు, పవన్, రమేష్ ు కేసును చేదించి నట్లు తెలిపారు.