– జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
నవతెలంగాణ – మద్నూర్
ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్పెషాలిటీ వైద్య సేలు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల పేదలకు మెరుగైన వైద్య సేవలు, తొలుత తొమ్మిది రకాల సేవలతో ప్రారంభం. అందుబాటులో గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సేవలు, ఒక్కోరోజు 1 లేదా 2 వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.