రామ్‌నగర్‌ బన్నీ

Ramnagar Bunnyచంద్రహాస్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘రామ్‌ నగర్‌ బన్నీ’. విస్మయశ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్‌ సమర్పణలో మలయజ ప్రభాకర్‌, ప్రభా కర్‌ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ మహత్‌ (వెలిగొండ శ్రీనివాస్‌) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆదివారం ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గ్డం ప్రసాద్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు ఆర్థిక సహాయాన్ని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కి హీరో చంద్రహాస్‌ అందజేశారు. హీరో చంద్రహాస్‌ మాట్లాడుతూ, ‘ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటిలో ఫస్ట్‌ మూవీగా ఇది మీ ముందుకు రాబోతోంది. అక్టోబర్‌లోనే రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. యూత్‌, ఫ్యామిలీకి.. అందరికీ నచ్చుతుంది. అలాగే ఈ సినిమా కలెక్షన్స్‌లో 10 శాతం కూడా వరద బాధితుల సహాయార్థం అందిస్తాం. నేను రియల్‌గా, రీల్‌ లైఫ్‌లోనూ ఒకేలా ఉంటాను. అలా ఉండటం చాలా మందికి నచ్చడం లేదు. నా ప్రతిభతో మా నాన్నకి మరింత మంచి పేరు తీసుకొస్తాను’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌ – రాజశేఖర్‌, ఎడిటింగ్‌ – మార్తాండ్‌ కె వెంకటేష్‌, సినిమాటోగ్రఫీ- అష్కర్‌ అలీ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ – అశ్విన్‌ హేమంత్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – విజరు, సమర్పణ – దివిజ ప్రభాకర్‌, నిర్మాతలు – మలయజ ప్రభాకర్‌, ప్రభాకర్‌ పొడకండ.