హైదరాబాద్: తెలంగాణలో ఫుట్‌బాల్ క్రీడకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శా్జ్) ఆదివారం ఫుట్‌బాల్ క్లినిక్‌ను నిర్వహించింది. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, తెలంగాణ స్పోర్ట్స్ అధారిటీలో శిక్షణ పొందుతున్న యువ సాకర్ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సోనీ బాలాదేవి ఫుట్‌బాల్ క్లినిక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఫుట్‌బాల్ కోచ్‌లు మహేశ్, బెనిటో, శాట్జ్ కోచ్‌లు రాంబాబు, రతన్ కుమార్, వినోద్, ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.