టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో హరితోత్సవం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో :తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణి సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) ప్రధాన కార్యాలయంలో హరితోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌరవరం రఘుమారెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయం వల్ల హరితహారం కార్యక్రమంపై సాధారణ ప్రజల్లో సైతం పచ్చదనం గురించి చైతన్యం వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని చెప్పారు. సంస్థ పరిధిలోని అన్ని జోనల్‌, సర్కిల్‌, డివిజన్‌ కార్యాలయాల్లో మొక్కలు నాటామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌లు టి శ్రీనివాస్‌, కే రాములు, సీహెచ్‌ మదన్‌మోహన్‌ రావు, పి నరసింహరావు, ఎస్‌ స్వామిరెడ్డి, జీ గోపాల్‌ తదితరులు పాల్గొని, మొక్కలు నాటారు.