చదువుతోపాటు క్రీడలలో రాణించాలని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్ పూర్ణచందర్ అన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం జరిగిన జిల్లా బాలుర సాఫ్ట్ బాల్ ఎంపికను పాఠశాల ప్రిన్సిపల్ పూర్ణచందర్ ప్రారంభించి క్రీడాకారుని ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువు తోపాటు క్రీడల్లో రాణించాలి, శారీరకంగా మానసికంగా అభివృద్ధి సాధించాలంటే ప్రతి రోజు ఉదయం సాయంత్రం క్రీడలలో పాల్గొనాలన్నారు. జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి. ప్రభాకర్ రెడ్డి మరియు మర్కంటి గంగా మోహన్ మాట్లాడుతూ.. ఎంపికలో జిల్లా ప్రబబుల్స్ జట్టుకు ఎంపికైన 25 మంది క్రీడాకారులకు మూడు రోజులపాటు శిక్షణ శిబిరం నిర్వహించి తుది జట్టును ఎంపిక చేసి ఈనెల 13 నుండి 15 వరకు సిరిసిల్ల జిల్లాలో జరగనున్న రాష్ట్ర జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపల్ సాయన్న, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ యోగేశ్వర్ దయాల్, సీనియర్ ఉపాధ్యాయులు గంగాధర్, సాఫ్ట్ బాల్ కోచ్ లు ఈ.నరేష్, సంతోష్, ఫిజికల్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ రాజేందర్ సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.