ధోబిఘాట్ వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని వినతి..

Request to remove the illegal structures at Dhobighat..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
రామన్నపేట మండల కేంద్రంలో రజక సంఘానికి , దోబీ ఘాట్ చాకలి కుంట నందు అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండాగే కి వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామన్నపేట గ్రామంలో రజక సహకార సంఘనికి చెందిన సర్వేనెంబర్ 698 ఏ 2-05 గుంటల భూమిని దోబీ ఘాట్ కొరకు రజక సంఘనికి ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనీ,  అ భూమి నందు గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా లవణం చంద్రశేఖర్, పచ్చ సుశీల, దండ్ల సమ్మయ్య, కుంకు శీను, కుంకు శీను రమణయ్య, శివరాత్రి మోహన్ తో పాటుగా   కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా అక్రమంగా ఈ యొక్క రజకుల ధోబిఘట్ ప్రదేశమును భూమిని ఆక్రమించి  అక్రమ నిర్మాణాలు చేపట్టారని,   ఈ విషయం పైన విచారణ చేసి దౌర్జన్యంగా చేసిన అక్రమ నిర్మాణాలను తొలగించి కూల్చివేసి ఆక్రమ నిర్మాణాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ కోరారు. ఈ  కార్యక్రమంలో రజక  సంఘల జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శివకుమార్, రజక సహకారసంఘం అధ్యక్షుడు అక్కనపల్లి  లింగయ్య , దామర నరసింహ మండ మల్లేశం దాగునూరి బాలరాజు, నామవండి అంజయ్య తునికి శివకుమార్ దావులూరి నరేష్ కల్లూరి నరసింహ దామర అంజయ్య, సభ్యులు పాల్గొన్నారు.