నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ యాస భాష, ఆస్తిత్వం తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన ప్రజా కవి, తెలంగాణ సాంస్కృతిక సారథి కాళోజి నారాయణరావు అని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని సోమవారం కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం మాట్లాడిన వ్యక్తి అన్న ఆమె అన్నారు. ఆయన జయంతి సందర్భంగా, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.