స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ జన సమితి విభాగమైన బీసీ సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశనికి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కామారెడ్డి జిల్లా తరఫున తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు పాల్గొని మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతేఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల హామీలు భాగంగా కామారెడ్డి జిల్లా బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజిక పరంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు ఆర్ కృష్ణయ్య , బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రమేష్ ముదిరాజ్, నరసయ్య, వివిధ బీసీ సంఘ కుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.