కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి

Kaloji Narayana Rao's services are unforgettable– కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి
కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా యువజన  క్రీడల శాఖ, ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్  హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కాళోజీ చిత్ర పటానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ రాజారాం, డీవైఎస్ఓ జగన్నాథం, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, డిపిఓ శ్రీనివాస్ ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.