జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల మహాత్మా జ్యోతి బాపూలే విగ్రహానికి సోమవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నీల నాగరాజ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు.గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 22 శాతానికి తగ్గించి బీసీలకు తీరని అన్యాయం చేసిందని అన్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో హామీలు ఇచ్చిన విధంగా సమగ్ర కులగణన సర్వే వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.రిజర్వేషన్లు పెంచని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేసి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.దయాకర్, సుమేర్,రాహుల్,రవి,విజయ్ తదితరులు పాల్గొన్నారు.