హైదరాబాద్‌లో  ‘డిజిటల్ సురక్ష ఫర్ టీన్స్’ రౌండ్‌టేబుల్‌ని నిర్వహించిన మెటా

నవతెలంగాణ హైదరాబాద్: యువత శ్రేయస్సు పట్ల తమ  నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ మెటా ఈరోజు హైదరాబాద్‌లో ‘టాకింగ్ డిజిటల్ సురక్ష ఫర్ టీన్స్’ పేరిట రౌండ్‌టేబుల్‌ను నిర్వహించింది. ఆన్‌లైన్ భద్రతపై మెటా యొక్క విధానంపై తల్లిదండ్రులకు అవగాహన పెంచడానికి మరియు డిజిటల్ ప్రపంచంలో టీనేజ్ శ్రేయస్సును రక్షించడానికి ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి 1M1B భాగస్వామ్యంతో పేరెంట్-ఎడ్యుకేటర్ ఫోరమ్ జరిగింది.  నగరంలోని 10-15 ఎంపిక చేసిన పాఠశాలల నుండి ఎంపిక చేసిన విద్యావేత్తలు మరియు తల్లిదండ్రులు డిజిటల్ భద్రతా కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వారి టీనేజ్ పిల్లల సోషల్ మీడియా ప్రయాణం యొక్క అనుభవాలను పంచుకోవడానికి రౌండ్ టేబుల్‌కు హాజరయ్యారు. మెటా తమ యాప్‌లు, ఫేస్ బుక్  మరియు ఇన్‌స్టాగ్రామ్  లో సమతుల్య అనుభవాన్ని అందించడానికి దాని భద్రత సాధనాలు మరియు ఫీచర్‌ల యొక్క వివరణాత్మక పరిజ్ఙానం ను అందించింది. తల్లిదండ్రులు మరియు అధ్యాపకులకు తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలను బుద్ధిపూర్వకంగా నిర్వహించడం గురించి వారి అనుభవాన్ని మార్పిడి చేసుకోవడానికి ఈ సెషన్ ప్రత్యేక అవకాశాన్ని అందించింది.
ఇన్‌స్టాగ్రామ్‌ వద్ద పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, డైరెక్టర్ నటాషా జోగ్  టీనేజ్ సోషల్ మీడియా అనుభవంలో తల్లిదండ్రులు మరియు అధ్యాపకులు పోషిస్తున్న కీలక పాత్రను నొక్కిచెబుతూ  “మా యాప్‌లలో మా వినియోగదారులకు సురక్షితమైన అనుభవాన్ని అందించడానికి మరియు ఆన్‌లైన్ లో ప్రమాదాలను నివారించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. డిజిటల్ సురక్ష రౌండ్ టేబుల్ అనేది ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండాల్సిన అవసరం గురించి తల్లిదండ్రులు మరియు అధ్యాపకులకు అవగాహన కల్పించడానికి , మా యాప్‌లలో అందుబాటులో ఉన్న సాధనాల గురించి వారికి అవగాహన కల్పించటానికి చేస్తున్న ప్రయత్నం. కమ్యూనిటీ అభిప్రాయాన్ని పొందేందుకు , మా భద్రతా ప్రయత్నాలను తెలుసుకోవడానికి మరియు అభివృద్ధి చేయడానికి మేము నిరంతరం ఈ అవకాశం ఉపయోగిస్తాము” అని అన్నారు.
యూజర్ సేఫ్టీ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, మెటా ఇప్పటికే 2024లో ఢిల్లీ, బెంగళూరు, పూణె మరియు జైపూర్ వంటి కీలక నగరాల్లో ఇలాంటి రౌండ్‌టేబుల్‌లను నిర్వహించింది. గత సంవత్సరం ‘డిజిటల్ సురక్ష సమ్మిట్’ నిర్వహించబడింది. యువత మరియు మహిళలకు సురక్షితమైన మరియు సమతుల్యమైన ఆన్‌లైన్ అనుభవాన్ని అందించడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఇది నిర్మించబడింది. అదనంగా, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ మరియు సైన్స్ & టెక్నాలజీ (ఐటిబిటి),  కర్ణాటక  ప్రభుత్వంతో రెండేళ్ల భాగస్వామ్యాన్ని మెటా  ప్రకటించింది. పాఠశాలలు మరియు కళాశాలల్లోని విద్యార్థులు మరియు అధ్యాపకులకు ఆన్‌లైన్ భద్రతపై సమాచారం,  అవగాహన మరియు విద్యపై సాధికారత కల్పించటం తో పాటుగా  డిజిటల్ పౌరసత్వం సైతం అందిస్తుంది.
గత మూడు సంవత్సరాలుగా, మెటా ఆన్‌లైన్ భద్రతను ప్రోత్సహించడానికి 50+ భద్రతా సాధనాలు మరియు ఫీచర్స్  ప్రారంభించింది. టీనేజ్ భద్రతకు సంబంధించి ఇటీవల రూపొందించిన ఫీచర్లు, ‘నైట్ నడ్జెస్’, ఇది అర్థరాత్రి ఉపయోగించినప్పుడు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను షట్ డౌన్ చేయమని వినియోగదారులను ప్రోత్సహిస్తుంది, అలాగే ‘క్వైట్ మోడ్’, ఇది యుక్తవయస్సులోని వినియోగదారులకు ఇన్‌స్టాగ్రామ్  పై గడిపిన సమయం, వారు ఏమి చూస్తారనే దానిపై మరింత నియంత్రణను అందించడంలో సహాయపడుతుంది.  ఇంకా, ఇన్‌స్టాగ్రామ్  యొక్క పేరెంటల్ సూపర్ విజన్  ఫీచర్‌తో, తల్లిదండ్రులు తమ పిల్లలు అనుసరించే ఖాతాలను, వారి పిల్లలను అనుసరించే ఖాతాలను వీక్షించవచ్చు మరియు వారి ఆన్‌లైన్ అనుభవాలలో మరింత పాలుపంచుకోవచ్చు. మెటా యొక్క ‘ఫ్యామిలీ సెంటర్’ తల్లిదండ్రులు మరియు యుక్తవయస్కులకు ప్లాట్‌ఫారమ్‌లను సురక్షితంగా నావిగేట్ చేయడం ఎలా అనే సమాచారాన్ని కనుగొనడానికి కూడా తోడ్పడుతుంది.