మా నాన్న సూపర్‌ హీరో

మా నాన్న సూపర్‌ హీరోసుధీర్‌ బాబు ఎమోషనల్‌ రోలర్‌కోస్టర్‌ రైడ్‌ ‘మా నాన్న సూపర్‌హీరో’తో అలరించడానికి సిద్ధమౌ తున్నారు. ‘లూజర్‌’ సిరీస్‌ ఫేమ్‌ అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్స్‌ బ్యానర్‌పై, సిఏఎం ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసి మేకర్స్‌ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఈ ఫస్ట్‌-లుక్‌ పోస్టర్‌లో సుధీర్‌ బాబు మధ్యతరగతి కుర్రాడిగా స్కూటర్‌ నడుపుతూ, స్కూల్‌ పిల్లలను పలకరిస్తూ కనిపించడం డిలైట్‌ ఫుల్‌గా ఉంది. తన చిరునవ్వు పోస్టర్‌కి పర్ఫెక్ట్‌ టచ్‌ యాడ్‌ చేసింది. ఈ సినిమా టీజర్‌ను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ‘మా నాన్న సూపర్‌హీరో’ మూవీ ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్‌ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్‌ అండ్‌ సన్‌ డ్రామా. సుధీర్‌ బాబు సరసన ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో సాయిచంద్‌, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్‌, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు.