బాధిత కుటుంబానికి అండగా రవీందర్ రావు

Ravinder Rao stands by the victim's familyనవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో చలి చీమల చెన్నయ్య(60) గత పది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త రవీందర్ రావు చెన్నయ్య కుటుంబాన్ని పరామర్శించి పేద కుటుంబానికి రూ.5000 వేలు ఆర్థిక సాయం చేసి అండగా నిలిచాడు. మృతునికి భార్య, ముగ్గురు కూతుర్లు, ఒక్క కుమారుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. వారిని పరామర్శించి ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించి అండగా ఉంటామన్నారు. మండల అధ్యక్షునితో పటు బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తోళ్ల గెలువయ్య, యాదయ్య,రెనయ్య, ఎండి బురాన్, కొత్త నరేష్ రావు, వంగ సాయి, కృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు.