విద్యుత్ షాక్ తో అవు మృతి

He died due to electric shockనవతెలంగాణ – మాక్లూర్ 
మండలంలోని దాస్ నగర్ సమీపంలోని పొలాల్లో విద్యుత్ షాక్ తగిలి అవు మృతి చెందిన సంఘటన బుదవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం దాస్ నగర్ గ్రామానికి చెందిన ద్యారంగుల నగేష్ అనే రైతుకూ చెందిన అవును ఈ నెల 8వ తేదిన ఇంటి వద్ద కట్టివేశారు. అది తెంపుకుని వెళ్లిందని, బుదవారం ఉదయం పోలలో ఉన్న ట్రాన్స్ పర్మర్ వద్ద మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. పొలంలో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్ ఫార్మర్ వైర్లకు ఆవు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమన్మ్ వ్యక్తం చేస్తున్నారు. ఈ పాడి ఆవు విలువ రూ.లక్ష ఉంటుందని నగేష్ తెలిపారు.