
– భూ కబ్జాలకు అడ్డాగా మారిన కుప్కాల్ గ్రామము
– భీంగల్ తాసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన కుప్కాల్ గ్రామవాసి
నవతెలంగాణ – భీంగల్ రూరల్
భీంగల్ మండలం కుప్కాల్ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా ఒకరిని చూసి మరొకరు గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూములు చెరువులు, కుంటలు, చెక్ డ్యాములకు సంబంధించిన భూములు, చెరువులకు సంబంధించిన కాలువలు, కొందరి రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ ఆస్తులను దోచుకుని తింటున్నారు. గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు వారి సొంతానికి కబ్జాక్ చేసుకొని సాగు చేస్తున్నారు. అలాగే గ్రామంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఫ్లాట్లలో అక్రమాలకు పాల్పడ్డారని, కొందరు నాయకులు అర్హులైన వారికి కాకుండా అనార్హులకు రుసుముల(లంచాల) ఆశకు అనర్హులైన వ్యక్తులకు ఇవ్వడం జరిగిందని, గ్రామంలో ఇలా ఇంకెన్నెన్నో ప్రభుత్వానికి సంబంధించిన భూములతో పాటు నాసిరకమైన కట్టడాలు పొలిటికల్ పవర్ ఉంటే చాలు ఏమైనా చెయ్యొచ్చు అనే విధంగా రాజ్యాంగాన్ని సైతం పక్కనపెట్టి జీవోలను సైతం పక్కనపెట్టి ఇష్ట రాజ్యాంగ కొంతమంది వ్యక్తులు వివరిస్తున్నారని గ్రామంలో కొందరు తెలియజేయడం జరిగింది. పలుమాలకు,అధికారులకు మొరపెట్టుకున్న గ్రామస్తులు ఏ అధికారి కూడా స్పాట్ పైకి వచ్చి చర్యలు తీసుకోవడం లేదని నిమ్మకు నీరు ఇతని వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పలుమార్లు ఎన్నో వినతి పత్రాలు సమర్పించుకున్న గాని వాటికి ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు మొరపెట్టుకుంటునరు. ఇకనైనా తక్షణమే ప్రభుత్వ అధికారులు చట్టరీత్య చర్యలు తీసుకొని గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూములను కబ్జాల నుండి కాపాడాలని గ్రామస్తులు తెలియజేయడం జరిగింది.