జన్నారం మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా డీఆర్డీఏ పీడీ జన్నారం మండల స్పెషల్ ఆఫీసర్ కిషన్ కోరారు. బుధవారం మండలంలోని రాంపూర్, తిమ్మాపూర్, తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. గ్రామాల్లో చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు ఎంపీడీవో శశికళ, ఎంపీఈవో జలంధర్ పంచాయతీ కార్యదర్శులు లావణ్య , తదితరులు ఉన్నారు.