అడవుల రక్షణ పైనే జీవకోటి మనుగడ ఆధారపడి ఉంటుందని అటవీశాఖ అశ్వారావుపేట రేంజర్ ఎం. మురళీ స్పష్టం చేశారు.అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని బుధవారం అటవీ సిబ్బంది ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం నుండి స్థానిక మూడు రోడ్ల ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మా ఆయన మాట్లాడుతూ అడవులను రక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందని గుర్తు చేశారు. అడవులను కాపాడుకుంటే అవి మనల్ని రక్షిస్తాయని వివరించారు.అడవులు మాత్రమే భావి తరాలకు అండగా నిలుస్తాయని చెప్పారు.అనంతరం అమరులకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ,ఎఫ్బీఓ లు పాల్గొన్నారు.