నవతెలంగాణ-తొగుట: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కాన్గల్ గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం ఎస్ఐ రవికాంత రావు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దొమ్మాట స్వామి (32) అదే గ్రామానికి చెందిన పెద్దమాతరి మల్లయ్య వద్ద 5 ఏండ్ల క్రితం మూడు ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసు కొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తు న్నాడు. వ్యవసాయం కలిసి రాక పోవడంతో పంట లు సరిగా పండక అప్పులు పెరిగిపోయాయి, వాటికి తోడు ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యాడ ని తెలిపారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక జీవితంపై విరక్తి చెంది తన కౌలుకు చేస్తున్న వ్యవ సాయ పొలం వద్ద వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడని చెప్పారు. మృతుని భార్య దొమ్మాట లావణ్య పిరియాదు మేరకు కేసు నమోదు పరిచి దర్యాప్తు ప్రారంభించామని ఎస్ఐ తెలిపారు. మృతునికి ఇద్దరు చిన్న కూతుర్లు ఉన్నారు. యజమాని మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.