జుక్కల్ ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి 335 కోట్లు..

– సెంటర్ లైటింగ్ కోసం 32 కోట్లు వీటిలో మద్నూర్ మండల కేంద్రానికి తొమ్మిది కోట్లు మంజూరు
– విలేకరుల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే వెల్లడి
నవతెలంగాణ – మద్నూర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ హయంలో జుక్కల్ నియోజకవర్గంలోని ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి 335 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే మంగళవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెల్లడించారు. మద్నూర్ మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు కోసం తొమ్మిది కోట్లు మంజూరు చేయించడం జరిగిందని త్వరలోనే మద్నూర్ మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. సెంటర్ లైటింగ్ ఏర్పాటు కోసం గతంలో బిచ్కుంద మండల కేంద్రానికి 12 కోట్లు మంజూరు కాగా ప్రస్తుతం ఈనెల 15న జీవో ఆర్టి నంబర్ 225 ప్రకారం జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండలానికి 9 కోట్లు జుక్కల్ మండలానికి 4,50 కోట్లు నిజాంసాగర్ మండలానికి 3,00 కోట్లు పిట్లం మండలానికి 12 కోట్లు పెద్ద కోడప్పుగల్ మండలానికి 3,50 కోట్లు ఈ విధంగా మొత్తం 32 కోట్లు గతంలో బిచ్కుంద మండలానికి మంజూరైన 12 కోట్లతో మొత్తం 44 కోట్లు నియోజకవర్గం లోని మండల కేంద్రాల్లో సెంటర్ లైటింగ్ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. రోడ్ల అభివృద్ధికి కాకుండా బ్రిడ్జిల్లా నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు. జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం వందల కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జుక్కల్ నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో స్థానిక సర్పంచ్ సురేష్, బీఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ బండి వార్ విజయ్, ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.