అక్రమంగా చెట్లు నరికి వసిన వారిపై కేసు నమోదు  

A case has been registered against those who cut trees illegally–  మాచారెడ్డి ఎస్సై
నవతెలంగాణ –  కామారెడ్డి
మాచారెడ్డి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మార్చబోయిన మహేశ్వరి తన పరిధిలోని అడవిలో అక్రమంగా ప్రవేశించి చెట్ల నరికివేశారని వారిపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం  తేదీ 10/09/2024 మంగళవారం నా ఉదయం 10 గంటల ప్రాంతంలో మాచారెడ్డి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మాచబోయిన మహేశ్వరి,  తమ విధుల్లో భాగంగా బీట్ నందు తిరుగుతుండగా కంపార్ట్మెంట్ నెంబర్ 547 రత్నగిరి పల్లి బీట్ నందు కొందరు వ్యక్తులు అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి చెట్లను నరికివేశారనీ,  వీళ్లంతా మైసమ్మ చెరువు తండా కి చెందిన 12 మంది అని మాచ రడ్డి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు మాచారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ తెలిపారు.