
మండలంలోని పోతునూరు గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులను మండల ఎంపీడీఓ ఉమా దేవి పరిశీలించారు.ఈసందర్బంగా ఆమె గ్రామంలో నిర్మిం చిన వైకుంఠధామాన్ని, డంపింగ్‌యార్డులో తడిపొడి చెత్త వేరుచేసి వాటిని పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, వర్మీ కంపోస్ట్ షెడ్ లను పరిశీలించారు. డంపింగ్ యార్డుల పనులను పరిశీలించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాదులు ప్రభలకుండా మురుగు కాలువల్లో, వాటర్ ట్యాంక్ లో బ్లీచింగ్ చల్లాలని తెలిపారు. దోమలు రాకుండా గడ్డి, పిచ్చి మొక్కలపై గడ్డి మందు మందును పిచికారీ చేయాలని సూచించారు. కార్యదర్శులు సమయంపాలన పాటిస్తూ గ్రామాల్లో సమస్యలు తలెత్త కుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకట్రామ్ నాయక్, ఏపీఓ వెంకటేశ్వర్లు, కార్యదర్శి లక్ష్మి, రామ్మూర్తి, మెహజాబి, లావణ్య అంజుమ్, ధర్మారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ ఎల్లయ్య, మదనజీ తదితరులు పాల్గొన్నారు.