రేషన్ కార్డు లేని రైతులు వివరాలు అందించాలి

Farmers without ration card should provide details– జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి
నవతెలంగాణ – జమ్మికుంట
రేషన్ కార్డు లేని రైతుల వివరాలు స్థానిక ఏ ఈ ఓ కార్యాలయంలో అందించాలని జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి అన్నారు. బుధవారం జమ్మికుంట వ్యవసాయ కార్యాలయంలో  రేషన్ కార్డు లేకుండా రుణమాఫి కానీ రైతుల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ త్వరగా గతిన పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎంట్రీ చేసిన రైతుల వివరాలను ఆమె పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి  వ్యవసాయ అధికారి మమత  వ్యవసాయ విస్తరణ అధికారులు రాంప్రసాద్, రైతులు పాల్గొన్నారు.