పత్తిపాక ఫౌండేషన్, గరిపెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో సాహిత్య కార్యశాలను ఏర్పాటు చేసి, తెలంగాణ రాష్ట్రంలోని 30పాఠశాలలను ఎన్నుకొని విద్యార్థులకు సాహిత్య శిక్షణను ఇచ్చినట్లు ఏర్గట్ల తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ, గంగాధర్ తెలిపారు. ఇందులో భాగంగా ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు కార్యశాల శిక్షణకు ఎంపికయ్యారని, విద్యార్థులకు కవితలు, కథలు రాయడం, లేఖ రచన మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చారని, కథలు రాసిన విద్యార్థులకు పత్తిపాక ఫౌండేషన్, గరిపెల్లి ట్రస్ట్ వారు ప్రశంస పత్రాలు అందజేయడంతో బుధవారం వాటిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి చేతుల మీదుగా విద్యార్థులకు అందించారని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు మునీరొద్దీన్, రాజశేఖర్, శ్రీనివాస్, రాజ నర్సయ్య, రాజేంధర్, పవన్, విజయ్, ఇందిర పాల్గొన్నారు.