బాధిత కుటుంబానికి బాసటగా వివేకానంద ట్రస్ట్

నవతెలంగాణ- రామారెడ్డి
మండల కేంద్రానికి చెందిన తోకల లింగం మృతిచెందగా వారి కుటుంబానికి బుధవారం వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.3000, 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ… ఆపదలో ఉన్న వారిని తోటి మానవునిగా, ఆదుకోవడమే మానవత్వం అని అన్నారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కడెం శ్రీకాంత్, భూపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.