విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

Students should rise to higher standards– సిడబ్ల్యుసి చైర్ పర్సన్ Dr.ఎస్.నాగ వాణి
నవతెలంగాణ – నెల్లికుదురు 
ప్రతి విద్యార్థి ఉన్నంత స్థాయికి ఎదగాలని సిడబ్ల్యుసి చైర్ పర్సన్ డాక్టర్ ఎస్ నాగమణి అన్నారు. మండలంలోని మునిగల వీడు జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో తొర్రూర్ ల్యాండ్స్ సేవ ధరణి అధ్యక్షురాలు మాధవ పెద్ది వాని ఆధ్వర్యంలో ఆ పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయుడు రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన విద్యార్థులకు విద్యార్థులకు నాగవాణి మురళీకృష్ణ కుమారుడు అప్పల శెట్టి పుట్టినరోజు సందర్భంగా నిమ్స్ పుస్తకాలను అందించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.  ఈ సందర్భంగా డాక్టర్ నాగవాణి  మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మీ ఉజ్వల భవిష్యత్తుకై చదువును ఆయుధంగా చేసుకొని కష్టపడి ఇష్టంతో చదివి ఉన్నంత స్థాయికి ఎదిగేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని అన్నారు. ఏదైనా సబ్జెక్టులో చిన్న సమస్య వచ్చినా వెంటనే సంబంధిత సబ్జెక్టు టీచర్  అడిగి తెలుసుకోవాలని అన్నారు. మిమ్ములను కన్న తల్లిదండ్రులకు పుట్టిన గ్రామానికి నీకు పాఠాలు బోధించిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రానున్న రోజుల్లో మీ విద్యాభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సేవా తరణి సెక్రటరీ రాధిక సభ్యులు శ్రీదేవి ,సబిత ఉపాధ్యాయులు సత్యనారాయణ, రామస్వామి, సలీం, భవాని ,సుదర్శన్, మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు, యాకయ్య, రంజిత్, నాగరాణి, అమర్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.