రామాలయం వద్ద మహాన్నదాన కార్యక్రమం

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదో రోజు మండల కేంద్రంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద స్థానిక ప్రముఖ వ్యాపారస్తులు గౌరిశెట్టి శ్రీనివాసరావు-విజయలలిత దంపతుల ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు బుధవారం రాత్రి మహాన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీనికి ముందు ఉదయం శ్రీనివాసరావు తల్లిదండ్రులు నాగభూషణం, భారతి, కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో చుట్టు ప్రక్కల గ్రామాల భక్తులు సైతం అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ అన్నదాన కార్యక్రమంలో స్థానిక ఎస్సై ఈ.రతీష్, ఏఎస్ఐ వెంకట్ రెడ్డి, కానిస్టేబుల్ కె.ఉపేందర్, ప్రముఖ వ్యాపారస్తులు అబ్బు నాగేశ్వరరావు, బూరుగడ్డ రాములు, నరెడ్ల వెంకన్న, నరెడ్ల శ్రీనివాసరావు, ఎ.వెంకటేశ్వర్లు, తులం ముత్తిలింగం, సిరినోముల శ్రీనివాసరావు, బుర్ర వెంకన్న, సంక ప్రభాకర్, నరెడ్ల నర్సింహారావు, యోగేందర్, సతీష్, ప్రవీణ్, కందిమల్ల సతీష్, అఖిల్, పోకల శ్రీనివాసరావు, మంత్రి కృష్ణార్జున, కందిమల్ల యుగంధర్, రాజు, శ్రీరాం సంపత్, సతీష్, జోలం శ్రీను, గుంతోజు శ్రీనివాసరావు, తెలగాని పురుషోత్తం, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, రాము, సందీప్, శంకరభక్తుల ప్రవీణ్, హరి, మంద సాయి, సంపత్, సత్యమోజు పరమేశ్వరా చారి, లింగయ్య, రెడ్డిమల్ల సమ్మయ్య, రాజు, నరేష్, జి.సందీప్, సీ.హెచ్.సందీప్, వై.ఉప్పయ్య, తదితరులు పాల్గొన్నారు.