రాంగ్‌రూట్లో వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దు

రాంగ్‌రూట్లో వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దు– డిచ్‌పల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మల్లేష్‌
నవతెలంగాణ-డిచ్‌పల్లి
రాంగ్‌రూట్‌లో వెళ్లి ప్రమాదాలబారిన పడొద్దని డిచ్‌పల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మల్లేష్‌ సూచించారు. నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘సర్కిల్‌ పరిధిలో ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, డిచ్‌పల్లి మండలాలు సైతం నేషనల్‌ హైవే రోడ్డు పరిధిలో ఉన్నాయి. ఎక్కువగా మోటారు వెహికల్‌ నడిపేవారు ప్రమాదాలకు గురి అవుతున్నారు. రాంగ్‌ రూట్లో వెళ్లకూడదని ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చాలావరకు రాంగ్‌ రూట్‌ వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున ప్రజలు ఐదు నిమిషాలు ఆలస్యమైనా వెళ్ళవచ్చు కానీ ప్రమాదానికి గురై హాస్పిటల్‌ పాలుకావడం, కుటుంబానికి దూరమై ప్రాణం నష్టం కాకుండా చూసుకోవాలి. సైబర్‌ నేరాలు జరగడానికి ముఖ్య కారణం అత్యాశ, ఆశ అని, ఎవరో తెలియని వారికి డబ్బులు చెల్లించడం అనవసరమైన లింకులు ఓపెన్‌ చేయడం ఆఫర్లు ఉన్నాయని ఆన్లైన్లో తెలియని వ్యక్తులతో లావాదేవీలు చేయకూడదు. చదువుకున్న వారు కూడా ఇలాంటి వాటికి గురి అవుతున్నారు. మైనర్‌ అమ్మాయిలు సోషల్‌ మీడియా వంటి వాటికి దూరంగా ఉండాలి. చదువుపై దష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలి. ఎవరిని అమాయకంగా నమ్మి సొంత విషయాలు చెప్పకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లలని ముఖ్యంగా యువకులను ఇంట్లో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎవరితో తిరుగుతున్నారు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా రాత్రి సమయాల్లో బయట తిరగకుండా చూసుకోవాల్సిన ప్రధమ బాధ్యత ఇంట్లో వారిది.