మనసిలాయో..సందడి షురూ

Manasilayo..Sandadi Shuru‘మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. అంటూ పక్కా మాస్‌ బీట్‌తో అమ్మాయి పాడే పాట వింటుంటే అందరూ స్టెప్పులేయాలనిపిస్తోంది. ఇంతకీ అంతలా అందరినీ మడత పెట్టేలా వచ్చిందెవరో తెలుసుకోవాలంటే ‘వేట్టైయాన్‌ – ది హంటర్‌’ సినిమా చూసేయాల్సిందేనంటున్నారు మేకర్స్‌. రజనీకాంత్‌ హీరోగా లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ బడ్జెట్‌ చిత్రమిది. అక్టోబర్‌ 10న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. టి.జె.జ్ఞానవేల్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ నాలుగోసారి రజనీకాంత్‌ సినిమాకు మ్యూజిక్‌ అందిస్తున్నారు. ‘మనసిలాయో..’ అంటూ సాగే ఈ పాట ఎనర్జిటిక్‌ బీట్‌తో సాగుతుంది. రజినీకాంత్‌, మంజు వారియర్‌ మధ్య వచ్చే పాట ఇది. అలాగే ఇందులో మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌ సైతం స్టెప్పులేస్తూ కనిపించటం విశేషం. శ్రీనివాస మౌళి రాసిన ఈ పాటను నకష్‌ అజీజ్‌, అరుణ్‌ కౌండిన్య, దీప్తి సురేష్‌ పాడారు. ఆసక్తికరమైన మరో విషయమేమంటే ఈ పాట తమిళ వెర్షన్‌ కోసం లెజెండ్రీ ప్లే బ్యాక్‌ సింగర్‌ మలేషియా వాసుదేవన్‌ వాయిస్‌ను ఏఐలో క్రియేట్‌ చేసి ఇందులో ఉపయోగించటం విశేషం.