మహిళా సంఘాలు ఋణాలు రద్దు చేయాలి: ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి.

Oplus_0

– స్వయం సాధికారత తోనే మహిలాభివృద్ది – రైతు సంఘం నాయకులు పుల్లయ్య

నవతెలంగాణ – అశ్వారావుపేట
రైతులకు వ్యవసాయ ఋణాలు చేసినట్లుగానే చిరు వ్యాపారాలు కోసం స్వయం సహాయక గ్రూపుల ద్వారా మహిళా సంఘాలకు ఇచ్చిన ఋణాలను రద్దు చేయాలని అఖిలభారత మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి మందలపు జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సంఘం అశ్వారావుపేట 4 వ మండల మహా సభ గురువారం నందిపాడు(మల్లు స్వరాజ్యం నగర్ ) లో మడకం సత్యవతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహా సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతి మహా సభను ఉద్దేశించి మాట్లాడారు.  కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్ధానాలు లోనే మహిళా సాధికారత చూపిస్తుందని మీ, పధకాలు అమలులో మాత్రం శూన్యం ప్రయోజనం అని అన్నారు.ఆరు గ్యారెంటీ ల్లో ఉచిత ప్రయాణం మిగతా ఏ గ్యారంటీ అమలు చేయడం లేదని ఎద్దేవా చేసారు.మిగతా అయిదు గ్యారంటీ లను అమలు చేయాలని కోరారు. ఈ నెల 19 న భద్రాచలంలో జరిగే జిల్లా మహా సభలను,అక్టోబర్ 21,22,23 తేదీల్లో కొత్తగూడెం లో జరిగే ఐద్వా రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహా సభలకు రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య,వ్యవసాయ కార్మిక జిల్లా నాయకు,స్థానిక మాజీ సర్పంచ్ ఊకే వీరాస్వామి హాజరై సౌహార్ధ సందేశం ఇచ్చారు.స్వయం సాధికారత తోనే మహిళ అభివృద్ది సాధ్యం అవుతుందని అన్నారు.ప్రతీ మహిళా చైతన్యం పొందాలని కాంక్షించారు. ఈ మహా సభలో తగరం నిర్మల,స్థానిక మాజీ సర్పంచ్ బుల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు.