– తిమ్మాపూర్ డబుల్ బెడ్ రూమ్ లో నీటి సమస్య
– స్వంత ఖర్చులతో నీటి సదుపాయం కల్పించిన పండారీ
– కృతజ్ఞతలు తెలిపిన డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసులు
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం కావడంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ.. దగ్గరున్న బోరు బావి దగ్గర నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని కాలం వెళలదీస్తున్నారు. ఈ సమస్యను ఎలాగైనా తీర్చాలని డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు దుబ్బాక మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. మరో వైపు ఈ విషయాన్ని తన సన్నిహితుల ద్వారా తెలుసుకొని మంగళవారం పండారీ లక్ష్మణ్ రావు తన సొంత ఖర్చులతో డబుల్ బెడ్ రూమ్ కాలనీలో బోర్ వేయించి,నీటి కష్టాన్ని తీర్చారు.ఈ సందర్భంగా తమకు నీటి గోస తప్పిందని,ఈ సమస్య ఉండదని భావించిన 30 కుటుంబాలకు చెందిన కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ…మానవత్వం చాటుకున్న లక్ష్మణరావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పండరి లక్ష్మణరావు మాట్లాడుతూ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్ఫూర్తితో గ్రామంలో తనకు తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నానని తెలిపారు.కార్యక్రమంలో బోనాల నవీన్ కుమార్, ప్రసాద్, గడ్డం గిరి, సాగర్, అనిల్, తిరుపతి, గోపాల్ తదితరులున్నారు.