బదిలీపై వెళ్తున్న డిప్యూటీ తహసీల్దార్ కు సన్మానం

Honor to the Deputy Tehsildar who is going on transferనవతెలంగాణ – ఏర్గట్ల
మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గతకొన్ని నెలలుగా పనిచేసి వేరొక ప్రదేశానికి బదిలీపై వెళ్తున్న డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ కు ఎమ్మార్వో శ్రీలత,తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఏర్గట్ల మండలానికి నూతన డిప్యూటీ తహసీల్దార్ గా బోధన్ నుండి విష్ణువర్ధన్ వచ్చినట్లు, ఎమ్మార్వో శ్రీలత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ. సదానందం,సీనియర్,కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.