నవతెలంగాణ – భీంగల్ రూరల్
తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం వారి మరియు జిల్లా ఎన్నికల అధికారి గారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికల కొరకు భీమ్ గల్ మండలములోని 27 గ్రామ పంచాయతీల వార్డు వారీ ముసాయిదా ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయ నోటిసు బోర్డులపై ప్రచురణ చేయడం జరిగింది. ఇట్టి ముసాయిదా లో గ్రామ పంచాయతీ వార్డు వారీ ఓటర్ల జాబీతా విషయములో ఏవైనా అభ్యంతరములు ఉన్న యెడల తేది:- 14.09.2024 నుండి తేది:- 21.09.2024 వరకు గ్రామ పంచాయతీలలో కానీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయము భీంగల్ యందు కానీ వ్రాతపూర్వకముగా అభ్యంతరములు సమర్పించినచో పరిశీలించి పరిష్కరించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమములో భీంగల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి & జిల్లా సహాయ ఎన్నికల అధికారి గంగుల సంతోష్ కుమార్ Mpo జావేద్, 27 గ్రామాల పంచాయతి కార్యదర్శులు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.