పిఏసీఎస్ చైర్మన్ అరెస్ట్ కు నిరసనగా రాస్తారోకో..

నవతెలంగాణ – తొగుట
ఈరోజు గుడికందుల గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్  కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా మెట్టు అలువాల రోడ్ బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు బీఆర్ఎస్ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి ఈ దుర్మార్గం చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడు తుందని ఆరోపించారు. తెలంగాణ రైతన్న కష్టాల్లో నుంచి కాపాడై రైతుబంధు, రుణమాఫీ తక్షణమే రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పరిపాలనను సవ్యంగా అందించాలని, రౌడీ రాజ కీయాలతో పరిపాలనను నడపాలనుకోవడం  మూర్ఖత్వం అన్నారు. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గుండాల్లారా ఖబర్దార్ అని హెచ్చరించారు.